సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శరవేగంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మరో షూటింగ్ షెడ్యూల్ తో చిత్రీకరణ కంప్లీట్ చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బుల్లెట్ నడుపుతూ స్టైలిష్ గా ఉన్న మహేష్ బాబు పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 70000 మంది ఈ పోస్టర్ ను లైక్ చేయడం విశేషం. టాలీవుడ్ లో ఒక పోస్టర్ కు ఇంతటి స్పందన రావడం ఫస్ట్ టైమ్. 70000 లైక్స్ తో మహేష్ బాబు పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీ పై
భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























