వెంకటేష్ హిందీ చిత్రం ‘తక్‌దీర్‌వాలా’కు 25 ఏళ్ళు

Victory Venkatesh Bollywood Movie Taqdeerwala Completes 25 Years.

తెలుగునాట అగ్ర కథానాయకుడిగా తనదైన బాణీ పలికించిన ‘విక్టరీ’ వెంకటేష్.. హిందీనాట కూడా సందడి చేశారు. తన కెరీర్ మొత్తమ్మీద రెండే రెండు హిందీ చిత్రాల్లో వెంకీ నటించారు. అందులో ఒకటి ‘అనారీ’కాగా.. రెండోది ‘తక్‌దీర్‌వాలా’. ఈ రెండు కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. తెలుగునాట ఘనవిజయం సాధించిన ‘చంటి’కి రీమేక్ గా ‘అనారి’ రూపొందితే.. మరో సెన్సేషనల్ మూవీ ‘యమలీల’ ఆధారంగా ‘తక్‌దీర్‌వాలా’ తెరకెక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘తక్‌దీర్‌వాలా’ విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు కె.మురళీమోహనరావు రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన రవీనా టాండన్ నాయికగా నటించింది. కాదర్ ఖాన్, అస్రాని, శక్తికపూర్, అనుపమ్ ఖేర్, రీమా లాగూ తదితరులు ముఖ్య భూమికలు పోషించగా.. అగ్ర నిర్మాత, వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు ప్రత్యేక పాత్రలో మెరిశారు. ఇందులో వెంకీ, రామానాయుడువి తండ్రీకొడుకుల పాత్రలే కావడం విశేషం. కాకపోతే.. వెంకీ పాత్ర తాలూకు చిన్నప్పటి ఎపిసోడ్స్ లో రామానాయుడు దర్శనమిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి ఆనంద్ – మిలింద్ స్వరాలు సమకూర్చారు. 1995 మే 12న విడుదలైన ‘తక్‌దీర్‌వాలా’.. నేటితో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + seven =