‘క్రాక్’ అప్ డేట్ త్వరలోనే – కష్టపడి పనిచేస్తున్నాం..!

We Are Soon Coming Up With An Update On Krack Movie Songs Says Music Director SS Thaman

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మరో 10రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉందని ఇటీవలే తెలియచేసాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. కరోనా వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై అప్ డేట్ ఇచ్చాడు థమన్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా అప్ డేట్ త్వరలోనే వస్తుందని.. మిమ్మల్ని హ్యాపీ గా ఉంచడానికే ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడుతున్నామని.. నేను మీకు ప్రామిస్ చేస్తున్న… క్రాక్ సాంగ్స్ నిజంగా క్రాక్ తెప్పించేలా ఉంటాయి అని తన ట్విటర్ ద్వారా తెలిపారు. మరి ప్రస్తుతం అయితే థమన్ వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరి క్రాక్ సినిమా పాటలు కూడా అలానే సూపర్ హిట్ అవుతాయేమో చూద్దాం.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మే 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. మరి ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 16 =