‘జీవితం తలకిందులైపోయింది’ అందుకే ఇలా..!

World Has Turned Upside Down Due To Corona Virus Says Actor Allu Sirish
World Has Turned Upside Down Due To Corona Virus Says Actor Allu Sirish

మొత్తానికి కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. దెబ్బకు అందరూ ఇంటి నుండి బయటకు రావడానికి భయపడేలా చేసింది. కనీసం ఒకరినొకరు పలకరించుకునే ఉరుకుల పరుగుల జీవితం.. కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేనంత బిజీ..ఈ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. అందరికీ తమ కుటుంబాలతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా సెలెబ్రిటీస్ కు ఇది బాగా కలిసొచ్చింది. వాళ్ళది మరీ బిజీ లైఫ్ కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో జిమ్ లు లేకపోవడం వల్ల అల్లు హీరో శిరీష్ కూడా యోగా బాట పట్టాడు. చక్రాసనం వేసిన ఫొటోను తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. `జీవితం తలకిందులైపోయింది. కాబట్టి నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. బిజీ బిజీ జీవితంలో యోగాకు దూరమయ్యాను. కానీ, లాక్‌డౌన్ నన్ను మళ్లీ యోగా వైపు మళ్లించింది. పరికరాలు అక్కర్లేదు. ఎక్కడైనా చేయవచ్చు` అంటూ శిరీష్ పేర్కొన్నాడు.

కాగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో ఉండటం వల్ల సోషల్ మీడియా కు మాత్రం దగ్గరగానే ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇక ఈ కరోనా టైంలో వంటలు, వర్కవుట్లు, బ్యూటీ టిప్స్ ఇలా వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =