ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 4
యన్టీఆర్ 'బృందావనం' చిత్రానికి సీక్వెల్ ప్లాన్?
మెగాస్టార్‌తో మెహర్ రమేష్ రీమేక్ ప్లాన్?
కియారా అద్వానీ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనట
నిరాడంబరంగా జరిగిన దిల్ రాజు రెండో వివాహం..!
'వలయం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'తెలంగాణ రాబిన్ హుడ్' జీవితం ఆధారంగా సినిమా..!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ రికార్డ్
హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
సెంచురీ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్
మారిన 'సైకో' రిలీజ్ డేట్
శివాత్మికపై కృష్ణవంశీ ప్రశంసలు
రవితేజ తో నటించాలని ఉంది - సాయి ధరమ్ తేజ్
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్
'అకీరా' కు ఇష్టమైన హీరో అతనే..!
స్టార్ హీరోల తనయులకు కూడా ఫెవరేట్ హీరోలు ఉంటారు. తమ తండ్రి పెద్ద హీరో అయినా కూడా వారితో పాటు వారు అభిమానించే హీరో వేరే ఉంటారు. ఇక్కడ ఓ స్టార్ హీరో తనయుడికి కూడా అభిమాన హీరో వేరే ఉన్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో... ఆ తనయుడు ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తనయుడు అకీరా నందన్.
మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.
యన్టీఆర్ 'బృందావనం' చిత్రానికి సీక్వెల్ ప్లాన్?
యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిన చిత్రాల్లో 'బృందావనం' ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ సరికొత్తగా దర్శనమిచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్.. అప్పట్లో మంచి విజయం సాధించింది. అంతేకాదు.. పలు భాషల్లో రీమేక్ అయింది కూడా.
మెగాస్టార్‌తో మెహర్ రమేష్ రీమేక్ ప్లాన్?
' కంత్రి', 'బిల్లా', 'శక్తి', 'షాడో' చిత్రాలతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెహర్ రమేష్. భారీ విరామం తర్వాత ఓ మెగా ప్రాజెక్ట్‌ని టేకప్ చేయబోతున్నాడు ఈ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇప్పటికే మెహర్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు చిరు ప్రకటించారు కూడా.
కియారా అద్వానీ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనట
కియారా అద్వానీ.. ఈ తరం భారతీయ కుర్రకారు కలల రాణి. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగునాట.. ‘ఎం.ఎస్.ధోని’, ‘కబీర్ సింగ్’, గుడ్ న్యూస్’ సినిమాలతో హిందీనాట తనదైన ముద్ర వేసింది కియారా. ప్రస్తుతం కియారా చేతిలో ‘లక్ష్మీ బాంబ్’, ‘ఇందూకి జవాని’, ‘షేర్‌షా’, ‘భూల్ భులయ్య 2’... ఇలా నాలుగు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా.. కియారా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం వేరే ఉందట. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది కియారా.
నిరాడంబరంగా జరిగిన దిల్ రాజు రెండో వివాహం..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహంపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాటిపై క్లారిటీ ఇస్తూ తాను రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం, 20 మంది కుటుంబీకులు, స్నేహితుల మధ్య గత రాత్రి నిరాడంబరంగా జరిగింది.
తప్పదు బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాలి..!
కరోనా వల్ల అన్ని పరిశ్రమల లాగే సినిమా పరిశ్రమకు కూడా బాగానే నష్టం వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా దాదాపు 2వేల కోట్ల వరకూ బిజినెస్ ఆగిపోయిందని ఇటీవలే చెప్పిన సంగతి గుర్తుండేవుంటది. లాక్ డౌన్ తీసేసినా కూడా థియేటర్స్ మాత్రం ఇప్పట్లో తెరుచుకునే ఓపిక లేదు. ఈ జూన్ నుండి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా కూడా థియేటర్ లకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్న సినిమాల నిర్మాతలకు మాత్రం నష్టమే.
'మిస్ ఇండియా' - 'కొత్తగా కొత్తగా' కీర్తి సురేష్
మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.
పాట చిత్రీకరణలో 'క్రాక్'
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'క్రాక్'. మూడేళ్ల విరామం అనంతరం ఈ సినిమాతో అందాల తార శృతి హాసన్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మెరుపువేగంతో సాగుతోంది.
'వలయం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
'తెలంగాణ రాబిన్ హుడ్' జీవితం ఆధారంగా సినిమా..!
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం కేవలం పవన్ అభిమానులకే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడికి ఆనందకరమైన విషయమే. 'జనసేన' పార్టీ స్థాపించి తన పూర్తి జీవితాన్ని ఇక రాజకీయాలకే అంకితం చేస్తానని చెప్పాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే రాజకీయాల్లో తమ హీరో కష్టపడుతున్నాడులే అని.. ఆ రకంగా సపోర్ట్ చేస్తూ సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో ఒకటి పింక్ రీమేక్, ఇంకొకటి క్రిష్ సినిమా మరొక సినిమా హరీష్ శంకర్. ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ ను జరుపుకుంటుంది.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ రికార్డ్
1969 సంవత్సరం లో "సాథ్ హిందూస్థానీ" మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి 5 దశాబ్దాలుగా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అమితాబ్ , ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రెండవ భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ
ఫిబ్రవరి 1వ తేదీ హీరో నిఖిల్ కు డాక్టర్ పల్లవి కి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఏప్రిల్ 16వ తేదీ జరుగనుంది. ప్రేమ తన జీవితంలో పెను మార్పు తెచ్చిందన్న నిఖిల్ తన ప్రేమ కథ, పెళ్ళి గురించి ఇలా చెప్పారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.
సెంచురీ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్
సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ది 21 ఏళ్ళ ప్రయాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వరకర్తగా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు బాణీలకు అందించారు. సింహభాగం ఘనవిజయాలను అందుకున్నారు. పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో నంబర్ వన్ మ్యూజిక్ కంపోజర్ గా ఒకటిన్నర దశాబ్దం పాటు అలరించారు.
మారిన 'సైకో' రిలీజ్ డేట్
ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సైకో’. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగాప్రకటించారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
శివాత్మికపై కృష్ణవంశీ ప్రశంసలు
నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

"ప్రతి రోజూ పండగే " మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
హీరో సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా జంటగా యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన కామెడీ , ఎమోషనల్ డ్రామా "ప్రతి రోజూ పండగే " మూవీ 20 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఒక వినూత్న కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు థమన్ ఎస్ సంగీతం అందించారు.
రవితేజ తో నటించాలని ఉంది - సాయి ధరమ్ తేజ్
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. చిత్ర విజయం పట్ల సాయి ఆనందం వ్యక్తం చేశారు. మల్టీ స్టారర్ మూవీస్ పై తన స్పందన తెలియజేశారు.
వెబ్ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్
"అలా ఎలా "మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ నటించిన "కుమారి 21F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా " "అంధగాడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. హెబ్బా పటేల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెబ్బా పటేల్ ప్రస్తుతం నితిన్ "భీష్మ ", రాజ్ తరుణ్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీస్ లో నటిస్తున్నారు.