‘దిల్ రాజు’ పెళ్లి ఫొటోలు విడుదల..!

Tollywood Ace Producer Dil Raju Marriage Photos Are Out On Internet
Tollywood Ace Producer Dil Raju Marriage Photos Are Out On Internet

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన దిల్ రాజు.. లాక్ డౌన్ నేపథ్యంలో నిజామాబాద్‌ లోని తన స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిరాడంబరంగా కేవలం తన కుటుంబ సభ్యులు.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబంతో పరిచయమున్న యువతినే దిల్ రాజు వివాహమాడినట్టు తెలుస్తుంది. ఆమె ఎయిర్‌ హోస్టెస్‌ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇక దిల్ రాజు పెళ్లి ఫోటోలు బయటకి వచ్చాయి. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకోవాలని కూతురు హన్షితా రెడ్డి తోపాటు సన్నిహితులు కూడా చెప్పడంతో దిల్ రాజు ఈ విర్ణయం తీసుకున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =