పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!

Super Star Mahesh Babu Looks Stunning In A Cute Video Where He Is Seen Playing With His Pet Dogs
Super Star Mahesh Babu Looks Stunning In A Cute Video Where He Is Seen Playing With His Pet Dogs

టాలీవుడ్ ప్రిన్స్, రాజకుమారుడు అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ అందం పెరుగుతుంది కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. కాలేజ్ స్టూడెంట్ గెటప్ కూడా ఆయన ఇంకా సెట్ అవుతాడని మహర్షి సినిమాలో చేసి చూపించారు. ఇక ఇప్పుడు మహేష్ లుక్ ను చూసిన వారెవరైనా టాలీవుడ్ హీరోనా.. హాలీవుడ్ హీరోనా అన్న డౌట్ రాకుండా మారదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అందరూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. ఇప్పటికే గౌతమ్, సితార లతో ఆడుకుంటూ వుండే వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో వీడియో ను పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియోలో నీట్ షేవింగ్ లో మహేష్ తన పెట్ డాగ్స్ తో ఆడుకుంటూ ఉన్నాడు. అయితే మహేష్ లుక్ కు మాత్రం అందరూ ఫిదా అయిపోతున్నారు. మహేష్ లుక్ చాలా యంగ్ గా ఉంది. ఇంకా యంగ్ అండ్ లవర్ బాయ్ రోల్స్ కి ఆయన గెటప్ సెట్ అయ్యేలా ఉన్నాడు.

 

 

View this post on Instagram

 

My big boy turns 9♥️ Awesome time!! #pawsomeparty❤️❤️

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తన కెరీర్లో 27వ చిత్రాన్ని చేయనున్నాడు. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − two =