బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కి 15 ఏళ్ళు

Director Boyapati Srinu Debut Movie Bhadra Completes 15 Years.

మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి బోయపాటి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భద్ర’. టైటిల్ రోల్‌లో మాస్ మహారాజా రవితేజ నటించగా.. అతనికి జోడిగా మీరా జాస్మిన్ ద‌ర్శ‌న‌మిచ్చింది. దీప‌క్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, పద్మనాభం, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, ఈశ్వరీరావు, సుబ్బరాజు, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ, రేవతి, జీవా ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కులశేఖర్, భాస్కరభట్ల, విశ్వ గీతరచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. “తిరుమలవాసా”, “ఓ మనసా”, “ఆకాశం నేలకి వచ్చింది”, “ఏమైంది సారూ”, “ఎర్రకోకా పచ్చరైకా”, “ఏ ఊరే చిన్నదానా”, “జస్ట్ డూ ఇట్”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో (తమిళం – ‘శరవణ’. కన్నడ – ‘గజ’, బెంగాలీ – ‘జోష్’) రీమేక్ కావడం విశేషం. 2005 మే 12న విడుదలై ఘనవిజయం సాధించిన ‘భద్ర’.. నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =