కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 29

సినిమా వార్తలు

ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గ‌తంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ ప‌ర్ ఫెక్ట్‌’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. కాగా... త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వాస్తవ ఘటనల‌ ఆధారంగా చిరు, కొరటాల మూవీ?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న‌ సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌లే పూజ జ‌రుపుకున్న ఈ సినిమా... డిసెంబ‌ర్ తొలి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. అంతేకాదు... ప్ర‌స్తుతం కోకాపేట్‌లో ఓ కాలనీ సెట్ వేస్తున్నార‌ని, అక్క‌డే పాట‌తో చిత్రీక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుడ‌తార‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆసక్తికరమైన కథాంశంతో నితిన్‌, యేలేటి చిత్రం?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ మూవీ రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `చ‌ద‌రంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీలైన్‌పై ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ లో నవ్వులు పూయించిన రియల్ బిగ్ బాస్

మెగాస్టార్ చిరంజీవి.... ఈ పేరు వింటే అందరిలోనూ పెద్దరికం, హుందాతనం, నిండుతనం మూర్తీభవించిన ఒక మెగా ఫిగర్ కళ్ళముందు కదులాడుతుంది. అయితే అలాంటి మెగా ఫిగర్ లో నిన్న రాత్రి ఒక డిఫరెంట్ డైమెన్షన్ను చూసి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించి ఆఖరి దశకు చేరుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ షోలో ప్రదర్శించిన స్పాంటినిటీని, సెన్సాఫ్ హ్యూమర్ ను చూసి ఆశ్చర్య పోవటం జనం వంతయింది. తను నటించిన 151 సినిమాలలో 90 శాతం సినిమాలు డేరింగ్, డాషింగ్ అండ్ సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకున్నవే కావటంతో చిరంజీవి పట్ల జనంలో కూడా సీరియస్…

Team TFNవాట్సాప్
" బాక్సర్" కు జోడీ గా కియారా అద్వానీ ?
సినిమా వార్తలు

" బాక్సర్" కు జోడీ గా కియారా అద్వానీ ?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లు వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ అక్టోబర్ 10వ తేదీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. బాక్సింగ్ లో వరుణ్ తేజ్ ట్రైనింగ్ తీసుకొంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నక్సలైట్ ట్రైనింగ్ లో సాయి పల్లవి

సురేష్ ప్రొడక్షన్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల నాటి సామా జిక పరిస్థితుల ఆధారంగా విరాటపర్వం 1992 మూవీ రూపొందుతుంది. హీరో రానా పోలీస్ ఆఫీసర్, సాయి పల్లవి నక్సలైట్ గా మారే గాయని పాత్రలో నటిస్తున్నారు. నందితా దాస్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా నటిస్తుండగా, జరీనా వహాబ్, ప్రియమణి, ఈశ్వరీ రావు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nishabdham Movie Teaser Release Date Locked
ట్రైలర్ & టీజర్

నిశ్శబ్ధం మూవీ టీజర్ రిలీజ్ డేట్

స్టార్ హీరోయిన్ అనుష్క సూపర్ హిట్ మూవీ భాగమతి తరువాత నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ US లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ్ త‌రుణ్‌... సెంటిమెంట్ ఫ‌లిస్తుందా?

కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌... గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పాడు. ఈ నేప‌థ్యంలో... కొత్త చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో `అర్జున్ రెడ్డి` ఫేమ్ షాలినీ పాండే నాయిక‌గా న‌టించ‌గా... జి.ఆర్‌. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న‌ ఈ సినిమాని... క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క పాత్ర‌లో దీపికా ప‌దుకొణె?

`అరుంధ‌తి`(2009)... అగ్ర క‌థానాయిక అనుష్క ద‌శ‌, దిశ‌ని మార్చివేసిన చిత్రం. జేజ‌మ్మ‌, అరుంధ‌తి... ఇలా రెండు విభిన్న పాత్ర‌ల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసింది స్వీటీ. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి నిర్మాణద‌క్ష‌త... వెర‌సి బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా నిల‌చింది `అరుంధ‌తి`. అంతేకాదు... నాయికా ప్రాధాన్య చిత్రాల‌కు స‌రికొత్త ఉత్సాహాన్నిచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డ‌బ్బింగ్‌లో `అశ్వ‌థ్థామ‌`

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం `ఛ‌లో`. హోమ్ బేన‌ర్ ఐరా క్రియేష‌న్స్ లో నిర్మిత‌మైన ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు శౌర్య‌. అయితే, ఆ త‌రువాత ఇదే సంస్థ‌లో వ‌చ్చిన `@ న‌ర్త‌న‌శాల‌` నిరాశ‌ప‌రిచినా... ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్ర‌మే `అశ్వ‌థ్థామ‌`. స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంద‌ని స‌మాచారం. అంతేకాదు... బ్యాలెన్స్ ఉన్న పాట‌ను త్వ‌ర‌లోనే…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి చిత్రంలో తెలుగ‌మ్మాయి?

`అంత‌కుముందు ఆ తరువాత‌` (2013)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఈషా రెబ్బా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగ‌మ్మాయి... ఆపై ప‌లు చిత్రాల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసింది. కాగా... గ‌త ఏడాది యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లో పూజా హెగ్డే చెల్లెలి పాత్ర‌లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.... తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

హీరో నాని V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరో నాని 25వ మూవీ గా రూపొందుతున్న V మూవీలో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. బాలీవుడ్ సాంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు సంవ‌త్స‌రాదికి నాని సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌?

`గ్యాంగ్ లీడ‌ర్‌`తో 24 చిత్రాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న నేచుర‌ల్ స్టార్ నాని... ప్ర‌స్తుతం త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) `వి`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాని తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావ్ హైద‌రీ ఇత‌ర ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ సరసన లేడీ సూపర్ స్టార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా... అన‌తికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు ప‌వ‌న్‌. కొంతకాలం క్రితం రాజకీయరంగంలోనూ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్... అక్కడ కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే... దాదాపు రెండేళ్ళుగా పాలిటిక్స్‌లో బిజీగా ఉండడం వలన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్... మళ్ళీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకటేష్ ను డైరెక్ట్ చేయ‌నున్న‌ ఓంకార్?

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్‌... ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడ‌య్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌... దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంత‌రం ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అనంతరం... ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెర‌కెక్కించి అలరించాడు ఓంకార్‌. కాగా... ఇప్పుడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట ఓంకార్‌.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

అల .. వైకుంఠపురములో .. టబు ఫస్ట్ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నివేత పేతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రుపొంతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ కి థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `ఆర్ ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌?

`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్... బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో... అజ‌య్ త‌దుప‌రి చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ మ‌ధ్య ప‌లువురు యువ క‌థానాయ‌కుల కాంబినేష‌న్స్‌లో అజ‌య్ పేరు వినిపించినా... ఇప్ప‌టివ‌ర‌కు త‌న రెండో చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

యూరప్‌లో బన్నీ, పూజ రొమాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జ‌య‌రామ్‌, సునీల్‌, న‌వ‌దీప్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌కృష్ణ‌?

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని... ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్