మెగాస్టార్ చిరంజీవి…. ఈ పేరు వింటే అందరిలోనూ పెద్దరికం, హుందాతనం, నిండుతనం మూర్తీభవించిన ఒక మెగా ఫిగర్ కళ్ళముందు కదులాడుతుంది. అయితే అలాంటి మెగా ఫిగర్ లో నిన్న రాత్రి ఒక డిఫరెంట్ డైమెన్షన్‌ను చూసి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించి ఆఖరి దశకు చేరుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ షోలో ప్రదర్శించిన స్పాంటినిటీని, సెన్సాఫ్ హ్యూమర్ ను చూసి ఆశ్చర్య పోవటం జనం వంతయింది. తను నటించిన 151 సినిమాలలో 90 శాతం సినిమాలు డేరింగ్, డాషింగ్ అండ్ సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకున్నవే కావటంతో చిరంజీవి పట్ల జనంలో కూడా సీరియస్ అండ్ డిగ్నిఫైడ్ ఒపీనియన్ ఉంది. కానీ నిన్న బిగ్ బాస్ షోలో చిరంజీవి తన ఏజ్ అండ్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నప్పుడు చిరంజీవి వాళ్లలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత పరిచయం ఉన్నట్లుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక మెగాస్టార్ స్ధాయి వ్యక్తి తమ గురించి అంత పర్సనల్ గా, ఆప్యాయంగా మాట్లాడటంతో హౌస్ మేట్స్ అందరూ ఆనందంతో కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు.
ఇక జోక్స్ కటింగ్, సరదా సటైర్లు,స్పాంటేనియస్ కౌంటర్స్ విషయంలో మెగాస్టార్ ఇచ్చిన స్పాట్ రియాక్షన్స్ చూస్తే మనకు తెలిసిన సీరియస్ ‘ చిరు’లో ఇంత చిలిపితనం ఉందా అనిపించక మానదు. ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూసిన ప్రేక్షకులకే హౌస్ మెట్స్ అందరి పేర్లు గుర్తుoడటం కష్టం… కానీ అప్పుడప్పుడు ఏవో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చూసిన చిరంజీవి ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించటం ఆయన జ్ఞాపకశక్తికి నిదర్శనం. అలాగే విన్నర్ గా గెలిచిన రాహుల్ ను అభినందించడం కంటే రన్నరప్ గా వచ్చిన శ్రీముఖిని ఓదార్చుతూ ఆమెలో కాన్ఫిడెన్స్ కలిగించటానికి చిరంజీవి చెప్పిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి.
అన్నిటికంటే హైలెట్ క్రాస్ జండర్ ‘తమన్నా’ ను అభినందిస్తూ చిరంజీవి మాట్లాడినప్పుడు ఆమె భోరున విలపించింది. ” నీ గురించి నేను మాట్లాడుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు… కానీ నీకు అర్ధం అయి ఉంటుంది” అంటూ గతించిన ఒక వివాద సంఘటనను అన్యాపదేశంగా ప్రస్తావించారు చిరంజీవి.
మొత్తం మీద బిగ్ బాస్ రియాలిటీ షో ఫైనల్స్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించిన హావభావాలు, సెన్సాఫ్ హ్యూమర్ ఆ షోకే హైలెట్ గా నిలిచాయి…. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
Really hats-off to You Real Big Boss 💐💐💐💐
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























