యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం `ఛలో`. హోమ్ బేనర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మితమైన ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు శౌర్య. అయితే, ఆ తరువాత ఇదే సంస్థలో వచ్చిన `@ నర్తనశాల` నిరాశపరిచినా… ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రమే `అశ్వథ్థామ`. స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోందని సమాచారం. అంతేకాదు… బ్యాలెన్స్ ఉన్న పాటను త్వరలోనే చిక్ మంగళూరులో షూట్ చేయనున్నారని టాక్. మరి… ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంతో నాగశౌర్య… `ఛలో`ని మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… `అశ్వథ్థామ` 2020 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























