`గ్యాంగ్ లీడర్`తో 24 చిత్రాల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న నేచురల్ స్టార్ నాని… ప్రస్తుతం తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) `వి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని తెలుగు సంవత్సరాది (ఉగాది) కానుకగా మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే విడుదల తేదిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి… స్పెషల్ డేకి రానున్న ఈ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌తో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























