స్టార్ హీరోయిన్ అనుష్క సూపర్ హిట్ మూవీ భాగమతి తరువాత నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ US లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్ అసోసియేషన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిశ్శబ్ధం మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, అనుష్క, మాధవన్, అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. నిశ్శబ్ధం మూవీ టీజర్ నవంబర్ 6వ తేదీ 5PM కు రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగులో నిశ్శబ్ధం, ఇతర భాషలలో సైలెన్స్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























