బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్… ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్… దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంతరం ‘రాజు గారి గది’తో పలకరించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అనంతరం… ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెరకెక్కించి అలరించాడు ఓంకార్. కాగా… ఇప్పుడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడట ఓంకార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే, తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’(ధనుష్)… తెలుగునాట వెంకటేష్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఓంకార్‌కి దక్కిందని టాక్. త్వరలోనే ఓంకార్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థను సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ప్రథమార్థంలో పట్టాలెక్కనున్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: