ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 28

తమిళ్ 'అర్జున్ రెడ్డి' కి తప్పని రిలీజ్ కష్టాలు
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
మరో మెగాహీరోతో సురేందర్ రెడ్డి?
సేఫ్ జోన్ లోకి వెళ్లిన 'విజయ్ దేవరకొండ'
మహేష్ బాబు మేనల్లుడు సినిమాలో నిధి అగర్వాల్
'నో రెమ్యూనరేషన్' అంటున్న గోపీచంద్
ఖైదీ డైరెక్టర్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు
నిశ్శబ్దం టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

భీష్మ నుండి రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్
ప్రేమికుల రోజున 96 మూవీ తెలుగు రీమేక్ రిలీజ్ ?
అజిత్ కోసమా..? పవన్ కోసమా..?
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
ఫైటర్ మూవీ సంగీత దర్శకుడు మణిశర్మ
సేఫ్ జోన్ లో 'విజిల్' నిర్మాతలు
హీరో విశాల్ డిటెక్టివ్ 2 మూవీ ప్రారంభం
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?
మాకు ఎవరితో పోటీ లేదు -నిత్యా మీనన్
లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు బయోపిక్ మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వంలో జయలలిత గా నిత్యా మీనన్ నటిస్తున్న 'ది ఐరన్ లేడీ', AL విజయ్ దర్శకత్వం లో జయలలిత గా కంగనా రనౌత్ నటిస్తున్న 'తలైవి' మూవీస్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. ఇద్దరు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ లు నిత్యా మీనన్, కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ మూవీస్ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. .

తమిళ్ 'అర్జున్ రెడ్డి' కి తప్పని రిలీజ్ కష్టాలు
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
`వర్షం`, `డార్లింగ్`... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్కరించిన చిత్రాలివి. ఆ తరువాత ప్రేమకథలకు దూరమైన ఈ లవబుల్ స్టార్... సుదీర్ఘ విరామం అనంతరం మరో ప్రణయగాథతో పలకరించబోతున్నాడు. అది కూడా ఓ పిరియాడికల్ లవ్ స్టోరీతో. 1970 నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా... `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
పారిస్‌లో పాట పాడుకుంటున్న బన్నీ, పూజ
`సామజవర గమన`... యూ ట్యూబ్ వరల్డ్‌లో రీసెంట్ తెలుగు సెన్సేషన్. `అల వైకుంఠపురములో` చిత్రం కోసం యువ సంగీత సంచలనం థమన్ స్వరపరిచిన ఈ గీతం... మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా రికార్డులకెక్కింది. కాగా... `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యం, సిడ్ శ్రీరామ్ గానంతో వీనులవిందు చేసిన ఈ పాటను ఇప్పుడు కనుల విందుగా మలిచే పనిలో ఉంది యూనిట్. ఈ నేపథ్యంలోనే... ఈ పాట కోసం పారిస్ బాట పట్టింది `అల వైకుంఠపురములో`టీమ్. చిత్ర నాయకానాయికలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్న ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చుతున్నారు…
మరో మెగాహీరోతో సురేందర్ రెడ్డి?
మెగాఫ్యామిలీకి అచ్చొచ్చిన దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు. `రేసు గుర్రం` రూపంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి, `ధృవ`తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కి... తాజాగా `సైరా నరసింహారెడ్డి` రూపంలో మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ మూవీస్ అందించిన వైనం సూరి సొంతం. ఈ నేపథ్యంలో... త్వరలో మరో మెగాహీరోతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ హీరో మరెవరో కాదు ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
సేఫ్ జోన్ లోకి వెళ్లిన 'విజయ్ దేవరకొండ'
విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. ఇక మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో డీసెంట్ హిట్ కొట్టింది.
మహేష్ బాబు మేనల్లుడు సినిమాలో నిధి అగర్వాల్
అందం, అభినయం వున్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. ప్రస్తుతం నిధి తమిళంలో జయం రవి 25వ సినిమాలో నటిస్తోంది.
'నో రెమ్యూనరేషన్' అంటున్న గోపీచంద్
గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'చాణక్య' కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది.
ఖైదీ డైరెక్టర్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నాడు లో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి... ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్ల క్లబ్ లో చేరింది.
నిశ్శబ్దం టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.

భీష్మ నుండి రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు.

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్
మొత్తానికి ఇటు తెలుగు, అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త వెనుక పడినా ఇప్పుడు మాత్రం తన కెరీర్ పై దృష్టి పెట్టి పలు కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. ప్రస్తుతం హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ.
ప్రేమికుల రోజున 96 మూవీ తెలుగు రీమేక్ రిలీజ్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ హృద్యమైన ప్రేమకథ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 తమిళ మూవీ 2018 సంవత్సరంలో అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీ కి సరిపోయేలా స్క్రిప్ట్ లో దర్శకుడు మార్పులు చేశారు.
అజిత్ కోసమా..? పవన్ కోసమా..?
ఇప్పటికే పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది రెండు రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. బోనీ కపూర్ ఇప్పటీకే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ అనే పేరుతో అక్కడ రీమేక్ చేసారు. ఇక ఆ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు.
బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పూజ హెగ్డే ?
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈమూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రెడీ చేయడం లో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించాడు.
ఫైటర్ మూవీ సంగీత దర్శకుడు మణిశర్మ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైటర్ మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫైటర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్ , ఫైటర్ మూవీ కి సంగీత దర్శకుడిగా మణిశర్మ ను ఎంపిక చేశారు.
సేఫ్ జోన్ లో 'విజిల్' నిర్మాతలు
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటీకే ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది. దీనితో ఈ సినిమా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం.
హీరో విశాల్ డిటెక్టివ్ 2 మూవీ ప్రారంభం
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన తుప్పరివాలన్ తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ డిటెక్టివ్ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు డిటెక్టివ్ మూవీ సీక్వెల్ డిటెక్టివ్ 2 మూవీ రూపొందుతుంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’(డిసెంబర్ 20న విడుదల) కాగా... మరొకటి గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే... తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ.