`అరుంధతి`(2009)… అగ్ర కథానాయిక అనుష్క దశ, దిశని మార్చివేసిన చిత్రం. జేజమ్మ, అరుంధతి… ఇలా రెండు విభిన్న పాత్రల్లో తన అభినయంతో కనువిందు చేసింది స్వీటీ. కోడి రామకృష్ణ దర్శకత్వం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణదక్షత… వెరసి బాక్సాఫీస్ వద్ద పలు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలచింది `అరుంధతి`. అంతేకాదు… నాయికా ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాంటి `అరుంధతి` దశాబ్దకాలం తరువాత బాలీవుడ్ బాట పడుతోందని సమాచారం. అంతేకాదు… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ `మస్తానీ` దీపికా పదుకొణె ప్రధాన పాత్ర పోషిస్తుందని టాక్. వాస్తవానికి, `అరుంధతి`ని రీమేక్ చేయాలని గత కొన్నాళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనుష్కా శర్మ, కరీనా కపూర్ వంటి ప్రముఖ కథానాయికల పేర్లు ఈ రీమేక్ విషయంలో వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ పాత్ర ఇప్పుడు దీపిక చెంతకు చేరడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే `అరుంధతి` హిందీ వెర్షన్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: