యూరప్‌లో బన్నీ, పూజ రొమాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా… టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జ‌య‌రామ్‌, సునీల్‌, న‌వ‌దీప్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన‌ తాజా షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగ‌నుంద‌ని స‌మాచారం. అక్కడ బన్నీ, పూజపై ఒక రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేయనున్నారని తెలిసింది. అంతేకాదు… సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ఈ పాట తాలూకు మేకింగ్ వీడియోస్‌ను కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. కాగా, ఇప్పటికే విడుదలైన “సామజవరగమన”, “రాములో రాములా” గీతాలు శ్రోతలను అలరిస్తుండగా… త్వరలో రిలీజ్‌ కానున్న ఈ రొమాంటిక్ సాంగ్ కూడా అదే స్థాయిలో అల‌రిస్తుందేమో చూడాలి.

యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here