కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో అలరించిన యంగ్ హీరో రాజ్ తరుణ్… గత కొంతకాలంగా ట్రాక్ తప్పాడు. ఈ నేపథ్యంలో… కొత్త చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`పైనే తన ఆశలను పెట్టుకున్నాడు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో `అర్జున్ రెడ్డి` ఫేమ్ షాలినీ పాండే నాయికగా నటించగా… జి.ఆర్. కృష్ణ దర్శకత్వం వహించాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాని… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `ఉయ్యాలా జంపాలా` కూడా ఆరేళ్ళ క్రితం ఇదే డిసెంబర్ 25న రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో…`ఉయ్యాలా జంపాలా` తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన `ఇద్దరి లోకం ఒకటే` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























