స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నివేత పేతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రుపొంతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ కి థమన్ S సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల .. వైకుంఠపురములో .. మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన స్పందన లభించింది. టబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టబు ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది. టబు ఫస్ట్ లుక్ సింపుల్ గా , అద్భుతంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తివిక్రమ్ , అల్లు అర్జున్ సక్సెస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ పై భారీ
అంచనాలు ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: