చిరంజీవి చిత్రంలో తెలుగ‌మ్మాయి?

`అంత‌కుముందు ఆ తరువాత‌` (2013)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఈషా రెబ్బా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగ‌మ్మాయి… ఆపై ప‌లు చిత్రాల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసింది. కాగా… గ‌త ఏడాది యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లో పూజా హెగ్డే చెల్లెలి పాత్ర‌లో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి…. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే…. మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ఈషాని సంప్ర‌దించింద‌ట చిత్ర బృందం. అస‌లే మెగాస్టార్ చిరంజీవి సినిమా కావ‌డం…. అందునా త‌న పాత్ర‌కి ప్రాధాన్యం ఉండ‌డంతో ఈ చిత్రంలో న‌టించ‌డానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట ఈషా. చిరంజీవి సినిమాలో చిరు పాత్ర పోషించినా గుర్తింపు రావ‌డం ఖాయం. మ‌రి… ఈ సినిమాతోనైనా మ‌న తెలుగ‌మ్మాయి ద‌శ‌, దిశ మారుతాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.