మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయాగా… తమిళ్, మలయాల, హిందీ మోషన్ పోస్టర్ లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. పోలీస్ గెటప్ లో వెరీ స్టైలీష్ లుక్ లో బాగా ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి పండుగా సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: