వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ

RT 66 Movie Story Was Based on Real Life Incidents,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,#RT66 Movie Story,Ravi Teja New Movie on Real Life Incidents,Ravi Teja 66 Movie Story

ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యం లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ #RT66 మూవీరూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరో గా రూపొందిన బ్లాక్ బస్టర్ తెరి మూవీ కి రీమేక్ అని ఊహాగానాలు చెలరేగాయి. #RT66 మూవీ ఏ మూవీ కి రీమేక్ కాదని, వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ రూపొందనుందని దర్శకుడు వెల్లడించారు. శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ S సంగీతం అందిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ మూవీ నవంబర్ 14 వ తేదీ ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ బలుపు మూవీ లో రవితేజ కు జోడీ గా నటించిన శృతి హాసన్ 6 సంవత్సరాల తరువాత #RT66 మూవీ లో రవితేజ కు జోడీ గా నటించడం విశేషం. VI ఆనంద్ దర్శకత్వం లో రవితేజ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఇక హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన డాన్ శీను, బలుపు మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందనున్న హ్యాట్రిక్ మూవీ #RT66 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =