తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ వరుస తెలుగు, తమిళ, హిందీ మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ మూవీ యారియాన్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రకుల్ నటించిన దే దే ప్యార్ దే మూవీ ఘనవిజయం సాధించింది. రకుల్ హీరోయిన్ గా నటించిన మర్జవాన్ మూవీ నవంబర్ 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి – సిరీస్ , MA ఎంటర్ టైన్ మెంట్, JA ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై కాశ్వీ నాయర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, రకుల్ జంటగా ఒక కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ రూపొందనుంది. హీరో అర్జున్ కపూర్, రకుల్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. రకుల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ , చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























