థాయ్ ల్యాండ్ లో “పొన్నియిన్ సెల్వన్” మూవీ షూటింగ్

Mani Ratnam Ponniyin Selvan Movie Shooting Begins In Thailand,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mani Ratnam New Movie Ponniyin Selvan,Ponniyin Selvan Movie Shooting Updates,Director Mani Ratnam Upcoming Movies

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పీరియా డిక్ డ్రామా “పొన్నియన్ సెల్వన్ “మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రెండు భాగాలుగా రూపొందనుంది. తమిళ కింగ్ రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న” పొన్నియన్ సెల్వన్ “మూవీ లో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, జయరామ్, మోహన్ బాబు, ఆది , ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్ ప్రధాన తారాగణం. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీ షూటింగ్ డిసెంబర్ రెండవ వారంలో థాయ్ ల్యాండ్ లో ప్రారంభం కానుంది. దర్శకుడు మణిరత్నం, ఆయన టీమ్ డిసెంబర్ మొదటివారం లో థాయ్ ల్యాండ్ చేరుకొంటారు.థాయ్ ల్యాండ్ లోని దట్టమైన అరణ్యాలలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారని సమాచారం.”పొన్నియిన్ సెల్వన్” మూవీ తమిళం తోపాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nineteen =