“మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ.. త్యాగములో అనురాగములో తరగని పెన్నిధి మగువ…” అంటూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘మాతృదేవత’. `మహానటి` సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా నటించారు. శోభన్‌బాబు, రేలంగి, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, జగ్గారావు, రాజబాబు, చంద్రకళ, విజయలలిత, హేమలత, సురభి బాలసరస్వతి ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు గీత రచన చేయగా… కేవీ మహదేవన్ వీనులవిందైన బాణీలు సమకూర్చారు. వీటిలో “మనసే కోవెలగా”, “మానవజాతి మనుగడకే” గీతాలు విశేషాదరణ పొందాయి. పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్ ఈ సినిమాని నిర్మించారు. 1969 నవంబర్ 7న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న ‘మాతృదేవత’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























