‘డిస్కోరాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్ – త్వరలో రానున్న టీజర్

Disco Raja Movie Updates, Disco Raja Release Date Locked, Disco Raja Telugu Movie Release Date, Discor Raja Movie Release Date Fixed, latest telugu movies news, Ravi Teja Disco Raja Release Date, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్.. టీజర్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక డిసెంబర్ లో వస్తుందనుకున్న ఈసినిమా వచ్చేఏడాది జనవరి వెళ్ళింది. జనవరి 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.