
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 27

నాగార్జునతో `ఊపిరి` రచయిత చిత్రం?
బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ లో రాజ్ తరుణ్
విశాల్ సినిమాలో గౌతమి?

'భీష్మ' ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’?
హాలీవుడ్ మూవీకి 'నిత్యా' డబ్బింగ్

'నిశ్శబ్దం' టీజర్ రిలీజ్

F2 మూవీ హిందీ రీమేక్ లో పూజ హెగ్డే ?
కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ లో నటుడుగా RGV

నిర్మాతగా మారిన సైరా 'డైరెక్టర్'
నారా రోహిత్ న్యూ మూవీ

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్

'నిశ్శబ్దం' టీజర్ కు సూపర్ రెస్పాన్స్
ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా తను చేసే ప్రతి సినిమాలో ఓ ప్రత్యేకత ఉండేలా.. విభిన్నంగా ఉండేలా చూసుకుంటుంది అనుష్క. అలా ఆలోచిస్తుంది కాబట్టే అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి సిరీస్, భాగమతి లాంటి సినిమాలు తీసి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి మరో ప్రయోగం చేయనుంది.
నాగార్జునతో `ఊపిరి` రచయిత చిత్రం?
‘ఊపిరి’... ‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. అటువంటి సినిమాకి రచయితగా పనిచేసిన అహిసోర్ సోల్‌మన్ డైరెక్షన్‌లో నాగ్ ఓ చిత్రం చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ లో రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిగా సింపుల్ గా ఉండి రాజ్ తరుణ్ తనదైన ప్రత్యేక స్టైల్ లో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. GR కృష్ణ దర్శకత్వం లో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఇద్దరి లోకం ఒకటే మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఒరేయ్ బుజ్జిగా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మహేష్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్?
ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్... తెలుగునాట పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ని నిర్మిస్తోంది ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ . ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... మహేష్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకుందని టాక్.
విశాల్ సినిమాలో గౌతమి?
విశాల్ కథానాయకుడిగా మిస్కిన్ రూపొందించిన యాక్షన్ క్రైమ్ థిల్లర్ `తుప్పరివాలన్` (తెలుగులో ‘డిటెక్టివ్’). 2017లో విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా ‘తుప్పరివాలన్ 2’ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మిస్కిన్. విశాల్ కి జంటగా ఆశ్య అనే నూతన కథానాయిక నటిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. 40 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ సాగుతుందని సమాచారం.
'యాక్షన్' సినిమా - ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా' పాటకు గుడ్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

'భీష్మ' ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. చెప్పినట్టే ఉదయం 10 గంటలకు ఈ వీడియో ను రిలీజ్ చేశారు.
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’?
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రారంభించి... 2020 మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
డిస్కో రాజా బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాబీ సింహా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
'రుద్రవీణ' పాటతో పవన్ పొలిటికల్ సెటైర్
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అభిమానులను నిరాశపరుస్తూ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. అంతేకాదు ఇకపై సినిమాలు తీయమని మరో బాంబు పేల్చారు. ఇక ఎన్నికలు అయిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. 'పింక్' రీమేక్ చేస్తున్నట్టు టాక్స్ వస్తున్నాయి.

'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న బిగ్ స్టార్స్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' మొదటిసారి డబ్బింగ్ చెపుతున్నా
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
హాలీవుడ్ మూవీకి 'నిత్యా' డబ్బింగ్
ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ కూడా చేరింది. డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్' 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.

'నిశ్శబ్దం' టీజర్ రిలీజ్
‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ముందుకు వస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

'డిస్కోరాజా' టీజర్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఎస్పీ. బాల సుభ్రమణ్యం పాట పాడిన ఈ పాట రెట్రో ఫీలింగ్ ను కలిగిస్తూ... బాగా ఆకట్టుకుంది.

F2 మూవీ హిందీ రీమేక్ లో పూజ హెగ్డే ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ & ఫ్రస్టేషన్ 2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. హీరో వెంకటేష్ కు జంటగా తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహరీన్ నటించారు. F2 మూవీ ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకాదరణ పొందింది.
కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ లో నటుడుగా RGV
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలతో రూపొందుతున్న KRKR మూవీ లోని మూడు సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్ర బాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పోలికలున్న వ్యక్తుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

నిర్మాతగా మారిన సైరా 'డైరెక్టర్'
డైరెక్టర్ లు నిర్మాతలుగా మరి సినిమాలు నిర్మించడం చూస్తూనే వున్నాం. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు నిర్మాతలుగా మారగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి 'సురేందర్ రెడ్డి' కూడా చేరిపోయాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఎంతో సమర్ధవంతంగా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఇక 'సైరా' లాంటి పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడంతో.. ఆ సినిమా వల్ల వచ్చిన కాన్ఫిడెంట్ తో సురేందర్ రెడ్డి సొంతగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ తో కలిసి వరుణ్ తేజ్ తో ఒక సినిమా తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నారా రోహిత్ న్యూ మూవీ
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్, నటుడు , నిర్మాత నారా రోహిత్ సక్సెస్ ఫుల్ బాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో , అసుర, జో అచ్యు తానంద, అప్పట్లో ఒకడుండేవాడు మూవీస్ విజయం సాధించాయి. నారా రోహిత్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ పరాజయం పాలయ్యాయి, కొన్ని నిలిచిపోయాయి. వీరభోగ వసంత రాయలు మూవీ తరువాత నారా రోహిత్ మూవీస్ రిలీజ్ కాలేదు.

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్
యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.