మహేష్ మేనల్లుడి ఎంట్రీ కి రంగం సిద్ధం

All set for Mahesh Babu Son In Law Entry Into Films,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu Son In Law Entry in Tollywood,Galla Ashok Entry in Tollywood,Mahesh Babu Son In Law Galla Ashok

మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించగా అది ఆగిపోయింది. అయితే మళ్లీ వేరే ప్రాజెక్ట్ సెట్ చేశారు. కాగా గతంలో ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ మరియు దేవదాసు సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా లాంచ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. నవంబర్ 10వ తేదీన రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా పద్మావతి నిర్మిస్తారని తెలుస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా వివరాలు పూర్తిగా తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు గల్లా అశోక్ వస్తున్నాడు. ఇప్పటికే కృష్ణ దగ్గర నుండి మహేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల ఇండస్ట్రీలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అశోక్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =