`అర్జున్ సుర‌వరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్

Arjun Suravaram Movie Has Got Lucky Mascots,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Arjun Suravaram Movie Updates,Arjun Suravaram Telugu Movie Latest News,Arjun Suravaram Movie Live Updates,Nikhil Sentiment Works For Arjun Suravaram Movie,#ArjunSuravaram

ఫేక్ స‌ర్టిఫికేట్ స్కామ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`… శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 29) జ‌నం ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ణిత‌న్` ఆధారంగా రూపొందిన ఈ యాక్ష‌న్ డ్రామా… ప‌లుమార్లు వాయిదా ప‌డి.. ఎట్టకేల‌కు ఏడాదికిపైగా ఆల‌స్యంగా విడుద‌లకు నోచుకుంది. అయిన‌ప్ప‌టికీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో… `అర్జున్ సుర‌వ‌రం`కి స‌ర్వ‌త్రా మంచి స్పంద‌న వ‌చ్చింది. కొన్ని ఏరియాల్లో థియేట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌డం చూస్తే… ఈ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కంటెంట్ తో పాటు `అర్జున్ సుర‌వ‌రం`కి రెండు సెంటిమెంట్స్ కూడా భ‌లేగా అచ్చొచ్చాయ‌నే చెప్పాలి. అందులో ఒక‌టి హీరో నిఖిల్ కి ఉన్న న‌వంబ‌ర్ సెంటిమెంట్ కాగా.. మ‌రొక‌టి లావ‌ణ్య త్రిపాఠి, `వెన్నెల‌` కిషోర్ కాంబినేష‌న్. గ‌తంలో నిఖిల్ న‌టించిన `యువ‌త‌`, `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` చిత్రాలు న‌వంబ‌ర్ నెల‌లో విడుద‌లై విజ‌యం సాధించ‌గా… ఇప్పుడా వ‌రుస‌లో `అర్జున్ సుర‌వరం` కూడా చేరింది. ఇక లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టించిన సినిమాల్లో `వెన్నెల‌` కిషోర్ హాస్య పాత్రలు పోషించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా` మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఈ జాబితాలో `అర్జున్ సుర‌వ‌రం` కూడా చేరింది. మొత్తానికి.. కంటెంట్ ప్ల‌స్ సెంటిమెంట్స్ తో `అర్జున్ సుర‌వ‌రం` హిట్ స్టేట‌స్ కి చేరుకోవ‌డం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =