గోదావ‌రి నేప‌థ్యంలో నాని, శివ చిత్రం?

Nani To Pair Up With Siva Nirvana For His New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nani New Movie Updates,Nani Latest News,Nani Upcoming Movie Details,Nani Next Film Updates,Nani Latest Movie Details

`నిన్ను కోరి` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. `పెళ్ళి చూపులు` ఫేమ్ రీతూ వ‌ర్మ నాయిక‌గా న‌టించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… శివ నిర్వాణ గ‌త చిత్రాలు `నిన్ను కోరి`, `మ‌జిలీ` త‌ర‌హాలో ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉంటుంద‌ని తెలిసింది. గోదావ‌రి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో అన్న‌ద‌మ్ముల అనుబంధం ప్ర‌ధానాంశంగా ఉంటుంద‌ని వినికిడి. ఐదుగురు అన్న‌ద‌మ్ముల క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. గోపీసుంద‌ర్ బాణీలు అందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుందని… 2020 ద్వితీయార్ధంలో ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంద‌ని టాక్.

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం నాని `వి`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2020 మార్చి 25న `వి` రిలీజ్ కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 10 =