తనీష్ ‘మహాప్రస్థానం’

latest telugu movies news, Tanish Alladi Gives An Update About His New Movie, Tanish Alladi Latest Movie Details, Tanish Alladi Latest News, Tanish Alladi New Movie Updates, Tanish Alladi Next Project Updates, Tanish Alladi Upcoming Film Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆతర్వాత హీరోగా మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన నటుడు తనీష్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవేమీ పెద్దగా ఆడలేదని చెప్పొచ్చు. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చి గత ఏడాది బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు తనీష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనీష్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీ ఆఫ్‌ ఆన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అంతకుమించి లాంటి హారర్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు జాని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు…క్రైమ్‌ నేపథ్యంలో ప్రేమకథతో మహాప్రస్థానం సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా జాని మాట్లాడుతూ…ఇదొక యాక్షన్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమకథకు తనీష్‌ సరిగ్గా సరిపోతారు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో లీనం చేస్తుందని తెలిపారు.

కాగా ఇంకా ఈసినిమాలో కబీర్‌ దుహాన్‌ సింగ్‌, అమిత్‌, గగన్‌ విహారి, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =