బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న ప్రముఖ రచయిత..?

Senior Writer Planning For RGV Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jonnavithula Ramalingeswara Rao Planning For RGV Biopic,RGV Biopic Latest News,RGV Biopic Live Updates,Jonnavithula Ramalingeswara Rao Planning Biopic On Ram Gopal Varma,Jonnavithula Planning For Ram Gopal Varma Biopic

రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై ఓ ఛానెల్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఫోన్ కాల్ లో మాట్లాడుతూ వర్మ డిబేట్ మధ్యలోనే బ్రేక్ చెప్పి వెళ్లిపోవడంతో జొన్నవిత్తుల ఆగ్రహం చేశారు. ఆయనపై కొన్ని అనూహ్య కామెంట్లు చేశారు. మరి వర్మ సైలెంట్ గా ఉండడు కదా.. ఆయనపై కొన్ని కామెడీ ట్వీట్స్ చేశారు. ఇక అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య వార్ నడుస్తూనే వుంది. అంతేకాదు అందరి బయోపిక్ లు తీస్తున్న వర్మ బయోపిక్ ను తాను తీస్తా అని చెప్పిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక జొన్నవిత్తుల వర్మ బయోపిక్ ను సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. శివ రోజుల నుండి ఈ ఇప్పుడు వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్ ల వరకు ఈ సినిమా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమాలో వర్మ పాత్ర కోసం అదే పోలికలతో వున్న వ్యక్తి కోసం చూస్తున్నదట. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో.

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్ ను రీసెంట్ గానే మార్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చాయి. సినిమా విడుదలపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. సెన్సార్‌ సభ్యులకు కొంత సమయమిచ్చి పరిశీలించాలని కోరింది. శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fourteen =