స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” నిశ్శబ్ధం ” 2020 సంవత్సరం జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్,సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ ” నిశ్శబ్ధం “పలు భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ” నిశ్శబ్ధం “మూవీ లో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి గా నటించారు. చిత్రకారిణి క్యారెక్టర్ కై అనుష్క చిత్ర కళ లో 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకొనడం విశేషం. పలు అందమైన పెయింటింగ్స్ ను అనుష్క రూపొందించినట్టు సమాచారం. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ లతో ” నిశ్శబ్ధం “మూవీ పై హైప్ క్రియేట్ అయింది.
“బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత అనుష్క నటించిన ” నిశ్శబ్ధం “మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: