సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!

We Don't Need A Playlist When Sitara Is Around Says Super Star Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ వుండే వీడియోలే కాదు అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మహేష్ కూడా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ వారితో ఆడుకుంటూ ఉన్నా వీడియో లను నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో నమత్ర సితార వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటునే ఉన్నారు. సితార అల్లరి వీడియోలతో పాటు, సింగింగ్, డాన్సింగ్ ఇక పలు వీడియోలు పంచుకున్నారు .

ఇక తాజాగా నమత్ర మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో బూమ్ బూమ్ సాంగ్ ని పాడుతున్న వీడియో పోస్ట్ చేశారు.అంతేకాదు మా ప్రయాణంలో ప్రత్యేకంగా ప్లే లిస్ట్ అవసరం లేదని.. తమ గారాల పట్టి ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్ అని.. తమ ప్రయాణాన్ని సితార చాలా జాయ్ ఫుల్ చేస్తుందని చెవుతున్నారు.


ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తన తర్వాత సినిమా పరుశురాంతో చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =