లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా బజ్ ను బాగానే క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం.. రితేష్ రానా
బ్యానర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు.. చిరంజీవి, హేమలత
సమర్పకులు.. నవీన్ యెర్నేనీ, రవిశంకర్ యలమంచలి
సంగీతం.. కాల భైరవ
సినిమాటోగ్రఫి.. సురేష్ సరంగం
కథ
ఈసినిమా ఓ హోటల్ నేపథ్యంలో సాగే కథ. రక్షణ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) భారతదేశంలో తుపాకీ చట్టాలను సవరించాలని.. గన్ కల్చర్ లీగలైజ్ చేయలన్నజీవోను ముందుకు తెస్తాడు. ఫలితంగా, తుపాకీ సంస్కృతి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది. కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ గన్ అందుబాటులోకి వస్తుంది. పసుపులేటి హ్యాపీ త్రిపాఠీ (లావణ్యా త్రిపాఠీ) పుట్టినరోజు పార్టీ కోసం రిట్జ్ గ్రాండ్ హోటల్‌కు వెళుతుంది. రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) కూడా ఆ హోటల్‌కు వస్తాడు. మాక్స్ పెయిన్ (సత్య), లక్కీ (నరేష్ అగస్త్య) కూడా అదే హోటల్ కు వస్తారు.. అసలు, ఈ నలుగురికీ సంబంధం ఏంటి? ఒకరికొకరు పరిచయం లేని ఈ నలుగురూ ఎలా కలిశారు? ఈ నలుగురినీ ఒక్క చోటకు చేర్చిన కారణం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
మత్తు వదలరా సినిమా తరువాత రితేష్ రానా దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మత్తువదలరా సినిమా కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించి సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు ఈసినిమా కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు. ఈసినిమా ప్రధానాంశం గన్ కల్చర్ గురించి. ప్రతి ఒక్కరికి గన్ చేతికి వస్తే ఎలా ఉంటుంది.. తమ చేతిలోకి గన్ వచ్చాక మనుషులు ఎలా ప్రవర్తిస్తారు.. గన్ కల్చర్ వల్ల నష్టాలేంటి? అనేది చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
ఇక అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన లావణ్య త్రిపాఠి మొదటి నుండి గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది అని చెప్పొచ్చు. ఆసినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది కానీ అనుకున్నంత సక్సెస్ మాత్రం రావట్లేదని చెప్పొచ్చు. ఇక ఈమధ్య కాస్త రూటు మార్చి డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో హ్యాపీ పాత్ర చేసింది. లావణ్య ఇప్పటివరకూ చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్ గా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా కొంచెం కొత్తగా చేసే క్యారెక్టర్ కావడంతో లావణ్య కూడా హుషారుగా చేసేసింది. తన కామెడీ యాంగిల్ ను మరోసారి చూపించింది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించంది.
ఇక వెన్నెల’ కిషోర్, సత్య, గుండు సుదర్శన్, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిత్విక్ సోధిగా వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే నవ్వించాడు. ఇక మరోసారి సత్య మాక్స్ పెయిన్‌గా మరోసారి తన కామెడీతో అదరగొట్టేశాడు. నరేష్ అగస్త్య, తో పాటు మిగిలిన నటీనటులు కూాడా తమ పాత్రల మేర నటించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: