బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్

21 F Actor Raj Tarun To Play The Lead In A Bollywood Remake Movie

సక్సెస్ ఫుల్ “ఉయ్యాలా జంపాలా ” మూవీ తో రాజ్ తరుణ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యి “సినిమా చూపిస్త మామ” , “కుమారి 21 F” , “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “, “అంధగాడు”, “రాజుగాడు” వంటి కామెడీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన “ఒరేయ్ బుజ్జిగా ” మూవీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ తరుణ్ ఒక ఇంటర్వ్యూ లోమాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయంలో పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నానని, ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “డ్రీమ్ గర్ల్ ” కామెడీ మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నానని , పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని లాక్ డౌన్ తరువాత అనౌన్స్ చేస్తానని రాజ్ తరుణ్ చెప్పారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన రెండు బ్లాక్ బస్టర్ హిందీ మూవీస్ తెలుగు లో రీమేక్ కావడం విశేషం. “అంధాధున్” మూవీ నితిన్ హీరోగా, “డ్రీమ్ గర్ల్ ” మూవీ రాజ్ తరుణ్ హీరోగా తెలుగులో రీమేక్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − six =