విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ “కోబ్రా ” లో నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్” మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై “కోబ్రా “మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు KS రవి కుమార్, ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు గెటప్స్ తో విక్రమ్ హీరోగా నటిస్తున్న “కోబ్రా “మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ లకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే 50శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “కోబ్రా “మూవీ కీలక షెడ్యూల్ ను చిత్ర యూనిట్ రష్యా లో ప్లాన్ చేసింది. కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రష్యా బ్యాక్ డ్రాప్ లో చెన్నై లో భారీ సెట్ రూపొందించి షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. “కోబ్రా “మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. హీరో విక్రమ్ ఈ మూవీ తో పాటు మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్ “, “మహావీర్ కర్ణ “మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: