
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 98


100 కోట్ల క్లబ్ లో "మణికర్ణిక"

`సైరా`లో తమన్నా పాత్ర డిటైల్స్

యాక్షన్ హీరోకు స్వల్ప గాయాలు

గుండెపోటుతో డీఎస్ దీక్షితులు కన్నుమూత

గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?

వెంకటేష్ `సంక్రాంతి`కి 14 ఏళ్ళు

నాని 24 సినిమా షురూ

ఏయన్నార్ `బంగారు కుటుంబం`కి పాతికేళ్లు

విక్టరీ వెంకటేష్ `మల్లీశ్వరి`కి 15 వసంతాలు

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్‌తో `వాట్సప్` అంటున్న అనిల్ రావిపూడి?

తమిళ్ "వర్మ" మూవీ రీషూట్ లో

`మన్మథుడు 2`కి `ఆర్ ఎక్స్ 100` స్వరకర్త?

`వెంకీ మామ`లో పాయల్ రాజ్‌పుత్?

కళా తపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్ 'విశ్వదర్శనం' టీజర్ రిలీజ్
కేవలం కమర్షియల్ సినిమాలే రాజ్యమేలుతున్న వేళ ఆ ఒరవడిని పక్కన పెట్టి కేవలం సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజండరీ డైరెక్టర్ బయోపిక్ ను ఈ తెరకెక్కిస్తున్నారు.

100 కోట్ల క్లబ్ లో "మణికర్ణిక"
వీర నారి రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 1857 సంవత్సరం బ్రిటిష్ ఈస్టిండియా పై పోరాటం నేపథ్యం లో మణికర్ణిక మూవీ రూపొందింది. దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంయుక్త దర్శకత్వం లో రూపొందిన మణికర్ణిక మూవీ లో కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా నటించారు. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు.

`సైరా`లో తమన్నా పాత్ర డిటైల్స్
దాదాపు పద్నాలుగేళ్ళుగా కథానాయికగా రాణిస్తోంది అందాల తార తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన ఈ మిల్కీ బ్యూటీ... జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. కాగా... సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది.

యాక్షన్ హీరోకు స్వల్ప గాయాలు
యాక్షన్ హీరో గోపీచంద్ షూటింగ్ లో గాయాలపాలయ్యారు. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతుంది. రాజస్థాన్ రాష్ట్రం లోని జైపూర్ లో మూవీ లోని బైక్ ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

గుండెపోటుతో డీఎస్ దీక్షితులు కన్నుమూత
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు (దీవి శ్రీనివాస దీక్షితులు) కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. మార్గమద్యంలోనే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన మురారి చిత్రంలో పూజారిగా నటించిన ఈయనకు ఆ సినిమాలో మంచి పేరొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం తదితర విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు.

గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?
ఒక భాషలో సినిమా అలా హిట్టయితే చాలా మరో భాషలో రీమేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ యంగ్ అండ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల గల్లీ బాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి కలెక్షన్లు కురిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మొదటిసారి నోరువిప్పిన జక్కన్న
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక తారక్ కూడా హాలీడే ట్రిప్ నుండి వచ్చేశాడు కాబట్టి కాబట్టి తాను కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడుకు ఐదవ వర్ధంతి శ్రద్ధాంజలి
ఆయనకంటే ముందు తెలుగు చలనచిత్రరంగంలో అద్భుత విజయాలు సాధించిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ ఆయన రాక తరువాతనే నిర్మాత అనే పదానికి ఒక "గ్లామర్" ఏర్పడింది.

వెంకటేష్ `సంక్రాంతి`కి 14 ఏళ్ళు
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. కెరీర్‌లో సింహభాగం ఈ తరహా చిత్రాలతోనే అలరించి... పలు ఘనవిజయాలను అందుకున్నారాయన. వాటిలో... 2005లో విడుదలైన `సంక్రాంతి` ఒకటి. తమిళ చిత్రం `ఆనందం` (2001)కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా స్నేహ, ఆర్తి అగర్వాల్ నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సంగీత, శివబాలాజీ, రతి, శర్వానంద్, చంద్రమోహన్, శారద తదితరులు నటించారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించగా... ఎస్.ఎ.రాజ్ కుమార్ స్వరాలు…

ఆసక్తిని రేకెత్తిస్తున్న IIT కృష్ణమూర్తి - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ వర్ధన్ దర్శకత్వంలో IIT కృష్ణమూర్తి అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పృథ్వి దండమూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజైంది. ఓ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. టీజర్ డేట్ ను కూడా ఆ పోస్టర్ లోనే ప్రకటించేసింది. ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

నాని 24 సినిమా షురూ
ప్రస్తుతం నాని.. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు ఇంకో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. గత కొద్దికాలంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఓ పోస్టర్ ద్వారా.

ఏయన్నార్ `బంగారు కుటుంబం`కి పాతికేళ్లు
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ అంటేనే... పలు క్లాసిక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం `బంగారు కుటుంబం`. మధ్యతరగతి కుటుంబ మనస్తత్వాలు, కుటుంబ బంధాలు, మానవ విలువలు... వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ మూవీగా నిలచింది. అంతేకాదు... 1994కి గానూ `ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారాన్ని అందుకుంది. అలాగే... `ఉత్తమ నటుడు`గా ఏయన్నార్‌కి `నంది` పురస్కారాన్ని అందించింది.

అక్కినేని వారి వరుడు- కొల్లిపర వారి వధువు- ఏడుపదుల నాటి ఏడడుగుల బంధం
జనానికి సినిమాలు అంటే ఎంత ఇష్టమో... సినిమా వాళ్లు అంటే ఎంత మోజో చెప్పలేము.. కానీ సినిమా వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా, పెళ్లికి పిల్లని ఇవ్వాలన్నా అంతే బెరుకు. 1950కి ముందు తరంలో ఎక్కువ శాతం సినిమా వాళ్ళు సినిమా వాళ్లనే చేసుకునేవారు. ఇండస్ట్రీలోని మగవాళ్లకు బయటి సంబంధాలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఇక సినిమా ఇండస్ట్రీలోని ఆడవాళ్ళ సంగతి సరే సరి.

విక్టరీ వెంకటేష్ `మల్లీశ్వరి`కి 15 వసంతాలు
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో పలు ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా `ఎఫ్ 2`లోనూ తన మార్క్ కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే ఆ చిత్ర ఘనవిజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక... హాస్యభరిత పాత్రల పరంగా వెంకీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచే పాత్రల్లో... `మల్లీశ్వరి` చిత్రంలోని `పెళ్ళి కాని ప్రసాద్` క్యారెక్టర్ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ముదురు వయసు బ్రహ్మచారిగా వెంకీ నటన ఆ సినిమాకే ప్రధాన బలంగా నిలచింది. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కె.విజయ భాస్కర్ బ్రాండ్... ఈ…

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ' వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

`మహానాయకుడు` విడుదల రోజే... బాలయ్య కొత్త చిత్రం ప్రారంభం?
రెండు మాసివ్ హిట్స్ (`సింహా`, `లెజెండ్`) తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను... మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాని `యన్.టి.ఆర్. మహానాయకుడు` విడుదల తేది అయిన ఫిబ్రవరి 22న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాదు... ఎన్నికల సమయంలో చిత్రీకరణకు విరామం ఇచ్చి... ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాగా... ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దాదాపుగా కన్‌ఫర్మ్…

మహేష్‌తో `వాట్సప్` అంటున్న అనిల్ రావిపూడి?
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్... తాజాగా `ఎఫ్ 2`తో `వంద కోట్ల గ్రాస్ క్లబ్` దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే... ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్‌ని కూడా అనిల్ రిజిస్టర్ చేయించినట్లు టాలీవుడ్ టాక్.

తమిళ్ "వర్మ" మూవీ రీషూట్ లో
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అవుతుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ వర్మ ద్వారా కోలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

`మన్మథుడు 2`కి `ఆర్ ఎక్స్ 100` స్వరకర్త?
కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మన్మథుడు` (2002)... కమర్షియల్‌గా సూపర్ సక్సెస్‌ను నమోదు చేసుకోవడమే కాదు... మ్యూజికల్‌గానూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడప్పుడే సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి... `మన్మథుడు` చిత్రం ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు వింటుంటే ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అంతలా... `మన్మథుడు` పాటలు తెలుగు శ్రోతలను అలరించాయి.

`వెంకీ మామ`లో పాయల్ రాజ్‌పుత్?
`ఆర్ ఎక్స్ 100`తో టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమా తెచ్చిన గుర్తింపుని... కాస్తంత ఆలస్యంగానైనా అవకాశాలుగా మలచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే పాయల్ రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అంతేకాదు... మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కో రాజా`లోనూ ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే... `మన్మథుడు` సీక్వెల్‌లోనూ కింగ్ నాగార్జున పక్కన ఓ హీరోయిన్‌గా నటించేందుకు ఈ అమ్మడు ఓకే చెప్పిందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వరుసలో మరో సీనియర్ హీరో పక్కనా పాయల్ సందడి చేయబోతోందని…