ఏయ‌న్నార్ `బంగారు కుటుంబం`కి పాతికేళ్లు

2019 Latest Telugu Movies News, 25 Years For ANR Bangaru Kutumbam Movie, 25 Years For ANR’s Bangaru Kutumbam Movie, 25 Years For Bangaru Kutumbam Movie, ANR Bangaru Kutumbam Movie Completed 25 Years, ANR Bangaru Kutumbam Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
25 Years For ANR Bangaru Kutumbam Movie

న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు కాంబినేష‌న్ అంటేనే… ప‌లు క్లాసిక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. అలాంటి ఈ ఇద్ద‌రి కల‌యిక‌లో వ‌చ్చిన మ‌రో విజ‌యవంత‌మైన చిత్రం `బంగారు కుటుంబం`. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ మ‌న‌స్త‌త్వాలు, కుటుంబ బంధాలు, మాన‌వ విలువ‌లు… వంటి అంశాల‌తో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ మూవీగా నిల‌చింది. అంతేకాదు… 1994కి గానూ `ఉత్త‌మ చిత్రం`గా `నంది` పుర‌స్కారాన్ని అందుకుంది. అలాగే… `ఉత్త‌మ న‌టుడు`గా ఏయ‌న్నార్‌కి `నంది` పుర‌స్కారాన్ని అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏయ‌న్నార్‌కి జోడీగా జ‌య‌సుధ న‌టించిన ఈ చిత్రంలో విక్ర‌మ్‌, హ‌రీష్‌, రాజ్ కుమార్‌, రంభ‌, య‌మున‌, రాజీవి, కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్-కోటి స్వ‌ర‌సార‌థ్యంలో `అమ్మంటే ప్రేమ‌కు రూపం` పాట ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఫిబ్ర‌వ‌రి 18, 1994న విడుద‌లైన `బంగారు కుటుంబం`… నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=VS5kEOGsH6E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.