ప్రస్తుతం నాని.. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు ఇంకో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. గత కొద్దికాలంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఓ పోస్టర్ ద్వారా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పూజ అనంతరం నిర్మాతలు పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ను విక్రమ్ కుమార్ కి అందజేశారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
మరి ఇది నానికి 24వ సినిమా .. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో వున్నాడు. ఆ నమ్మకాన్ని విక్రమ్ కుమార్ ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి మరి.
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: