`మ‌న్మ‌థుడు 2`కి `ఆర్ ఎక్స్ 100` స్వ‌ర‌క‌ర్త‌?

RX 100 Music Director for Manmadhudu 2?Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Music Director for Manmadhudu 2 Movie,Manmadhudu 2 Movie Latest News,Nagarjuna Manmadhudu 2 Movie Music Director,Manmadhudu 2 Telugu Movie Latest Updates
RX 100 Music Director for Manmadhudu 2?

కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన ఫీల్ గుడ్ రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ `మ‌న్మ‌థుడు` (2002)… క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ స‌క్సెస్‌ను న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు… మ్యూజిక‌ల్‌గానూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అప్పుడ‌ప్పుడే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదుగుతున్న రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌కి… `మ‌న్మ‌థుడు` చిత్రం ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్ప‌టికీ ఆ సినిమాలోని పాట‌లు వింటుంటే ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అంత‌లా… `మ‌న్మ‌థుడు` పాట‌లు తెలుగు శ్రోత‌ల‌ను అల‌రించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌రి అలాంటి మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ `మ‌న్మ‌థుడు`కి సీక్వెల్‌గా వ‌స్తున్న `మ‌న్మ‌థుడు 2`పైనా పాట‌ల ప‌రంగా అంచ‌నాలు ఉండ‌డం స‌హ‌జం. మ‌రి… ఈ రెండో `మ‌న్మ‌థుడు`ని స్వ‌రాల ప‌ల్ల‌కిలో ఊరిగించే బాధ్య‌త‌ను నాగ్ ఎవ‌రికిస్తున్నారు? అన్న‌ది గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో న‌డుస్తున్న చ‌ర్చ‌. తాజాగా… ఈ చ‌ర్చ‌కు తెర‌ప‌డింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌త ఏడాది మ్యూజికల్ గా మ్యాజిక్ చేసిన సెన్సేష‌న‌ల్ హిట్ `ఆర్ ఎక్స్ 100`కి బాణీలు అందించిన ఛైత‌న్ భ‌రద్వాజ్ ప‌నిత‌నానికి మెచ్చి… నాగ్ ఈ సీక్వెల్‌కి ట్యూన్స్ కంపోజ్ చేసే బాధ్య‌త‌ని అత‌నికే అప్ప‌జెప్పాడ‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌ర్కిల్స్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్‌.

`ఆర్ ఎక్స్ 100`లో ఛైత‌న్ అందించిన ప్ర‌తీ పాట‌… ఛార్ట్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ముఖ్యంగా `పిల్లా రా` అయితే గ‌తేడాది పాట‌ల్లో టాప్ 5లో ఉంటుంది. మ‌రి… అదే స్థాయి మ్యూజిక్‌ని `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌కి కూడా ఛైత‌న్ అందిస్తాడేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఛైత‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. రాహుల్ రవీంద్ర‌న్ దర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `మ‌న్మ‌థుడు 2` మార్చి నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. పోర్చుగ‌ల్ లో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా… ఇందులో నాగ్‌కి జోడీగా న‌టించే ఇద్ద‌రు క‌థానాయిక‌లుగా అనుష్క‌, పాయ‌ల్ రాజ్‌పుత్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో `మ‌న్మ‌థుడు` సీక్వెల్ తెర‌పైకి రానుంది.

[subscribe]

[youtube_video videoid=rdma778BpC0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here