దాదాపు పద్నాలుగేళ్ళుగా కథానాయికగా రాణిస్తోంది అందాల తార తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన ఈ మిల్కీ బ్యూటీ… జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. కాగా… సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నర్తకి లక్ష్మి పాత్రలో డీ గ్లామర్ లుక్‌లో కనిపించనుంది తమన్నా. అంతేకాదు… ఈ పాత్ర పరిధి తక్కువే అయినా సినిమాలో చాలా కీలకమైన పాత్ర అని తెలిసింది. దేశభక్తి భావాలు మెండుగా ఉండే ఈ పాత్ర కారణంగానే… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం మలుపు తిరుగుతుందట. ఆ రకంగా… మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుందట. ఇక డ్యాన్స్‌లకు పెట్టింది పేరైన తమ్మూ… `సైరా`లో సంప్రదాయ నృత్యాల్లోనూ తనదైన ముద్ర వేయనుంది. మరి… దసరా కానుకగా రానున్న `సైరా`తో తమన్నా కెరీర్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
[youtube_video videoid=1w5SRCH0hA4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: