ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 63

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

క్రేజీ కాంబినేషన్ లో మూవీ

జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మన్మథుడు నాగార్జున

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్

మహేష్ చిత్రంలో రమ్యకృష్ణ?

మ్యూజికల్ సెన్సేషన్ ‘ఖుషి’కి 18 ఏళ్ళు

బాలీవుడ్ రీమేక్ లో సూపర్ డీలక్స్

ఎన్జీకే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ సినిమాలో సీనియర్ నటుడు

కొత్త సినిమా టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

అర్జున్ సురవరం కు తప్పని కష్టాలు

రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ?

పవన్ కళ్యాణ్ ‘జానీ’కి 16 ఏళ్ళు

విజయవాడ లో సిల్వర్ జూబ్లీ మూవీ వేడుకలు

మూడు తరాల దర్శకులు... ఓ అరుదైన రికార్డు

మహేష్ బాబుతోనూ రిపీట్ చేస్తాడా?
'ఉండిపోరాదే' నిర్మాత అంటుంటే గర్వంగా ఉంది - నిర్మాత బెక్కం వేణు గోపాల్
డబ్బుండి కాదు.. ప్యాషన్ ఉండి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బెక్కం వేణుగోపాల్.. టీవీ ప్రొడక్షన్ మేనేజర్ గా, కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుగోపాల్ ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ దగ్గరనుండి ఆయన చేస్తున్న ప్రయాణం ప్రస్తుతం చాలా ‘‘హుషారు’’గా సాగుతుంది. ఈ యేడాది మూడు సినిమాలు విడుదల చేయాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్న బెక్కం వేణుగోపాల్ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ఫైనల్లీ ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదల తరువాత ఏపీలో ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. మార్చి 22న ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ ను ఆపేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దాంతో ఏపీలో రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి.

క్రేజీ కాంబినేషన్ లో మూవీ
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కీర్తి సురేష్ దూసుకుపోతుంది. ఇక ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…అటు హీరోగా.. ఇటు విలన్ గా.. మరోవైపు కుమార బాబు లాంటి క్యారెక్టర్లు చేస్తూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, ఫాథర్ గా మంచి పాత్రలతో దూసుకుపోతున్నారు. మరి అలాంటి వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది.. క్రేజీ కాంబినేషన్ కదా.

జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మన్మథుడు నాగార్జున
వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ తో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 మూవీ రూపొందుతుంది. రావు రమేష్, వెన్నెల కిషోర్, సీనియర్ నటి లక్ష్మి, తమిళ నటి దేవదర్శిని, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ RX 100 పాటలతో యూత్ లో హుషారు రేకిత్తించిన చైతన్ భరద్వాజ్ మన్మథుడు2 మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన తారాగణం గా రూపొందిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ప్రతిష్టాత్మకంగా రూపొందింది. నిర్మాతలు మహర్షి మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే 4ట్రైన్స్ ను రెంట్ కు తీసుకొని మహర్షి మూవీ పోస్టర్స్ తో కవర్ చేశారు

వెంకటేష్ ‘ఆడవారిమాటలకు... అర్థాలేవేరులే!’కి పుష్కరకాలం
కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు విశేషాదరణ పొందాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిష కథానాయికగా నటించగా… ఇతర ముఖ్య పాత్రల్లో కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, కలర్స్ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. 2007…

మహేష్ చిత్రంలో రమ్యకృష్ణ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటించనుందని సమాచారం. కాగా… ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించనుందని వార్తలు వస్తుండగా… తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇంకో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మ్యూజికల్ సెన్సేషన్ ‘ఖుషి’కి 18 ఏళ్ళు
‘ఖుషి’… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలచిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అలాగే… కథానాయకుడిగా పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా. ఆబాలగోపాలాన్ని అలరించిన ఈ స్టైలిష్ యూత్‌ఫుల్ మూవీకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. పవన్ కి జోడీగా భూమిక జంటగా నటించిన ఈ చిత్రంలో శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య కనిపిస్తాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మించాడు. అప్పట్లో మ్యూజికల్ గా సెన్సేషన్‌ను…

బాలీవుడ్ రీమేక్ లో సూపర్ డీలక్స్
టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, విజయసేతుపతి, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. గత నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి… కాదు కాదు ఆ పాత్రల్లో జీవించి మరీ పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఈ సినిమా అంత మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ఇస్తున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 7న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఎన్జీకే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే… గతేడాది సంక్రాంతికి గ్యాంగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య… ఇప్పుడు ఎన్జీకే సినిమాతో రానున్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ ఆలస్యం అవుతుంది.

వరుణ్ సినిమాలో సీనియర్ నటుడు
సీనియర్ నటుడు సత్యరాజ్ తెలుగులో కూడా మంచి మంచి ఆఫర్లను సొంత చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.. ఇటీవల వచ్చిన జెర్సీ సినిమాలో పాత్ర కూడా అంతే మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

కొత్త సినిమా టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఇక ఆ సక్సెతో వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ టిఎమ్ కృష్ణ దర్శకత్వంలో హిప్పి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ఈ మూవీ కూడా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలాగనే కనిపిస్తోంది.

అర్జున్ సురవరం కు తప్పని కష్టాలు
నిఖిల్ అర్జున్ సురవరం సినిమాకు ఒకదాని తరువాత ఒకటి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మొదట్లో సినిమా టైటిల్ వివాదం... దాంతో టైటిల్ ను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రిలీజ్ డేట్ ను కూడా మార్చుకున్నారు. ఎన్నోసార్లు వాయిదా వేసుకున్న తరువాత ఎట్టకేలకు ఇటీవల మే 1 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రకటించారు.

రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ?
బ్లాక్ బస్టర్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు ఎంటరయిన కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న ఆ మూవీ ఘనవిజయంతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ తో జంటగా నటించిన గీత గోవిందం మూవీ ఘనవిజయం తో స్టార్ డమ్ పొందారు. లక్కీ హీరోయిన్ రష్మిక కు మూవీ ఆఫర్స్ వెల్లువెత్తాయి. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. భీష్మ, AA 20, హీరో కార్తీ తో తమిళ మూవీ కమిట్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 26మూవీ లో కూడా రష్మిక నటించే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ‘జానీ’కి 16 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టి… ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్… అదే జోరులో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు. అలా ప్రయత్నించిన చిత్రమే ‘జానీ’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో… పవన్, రేణు దేశాయ్ జంటగా నటించారు.

విజయవాడ లో సిల్వర్ జూబ్లీ మూవీ వేడుకలు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ మే నెల 9 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బిజినెస్ మాన్, స్టూడెంట్ గా మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ ప్రీ రిలీజ్ వేడుక మేడే రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో జరుగనుంది. హీరో మహేష్ బాబు కు, అతని అభిమానులకు మహర్షి ఒక స్పెషల్ మూవీ. మహర్షి మూవీ మహేష్ బాబు నటించిన 25వ మూవీ. మహేష్ బాబు హీరోగా 25 మూవీస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా విజయవాడ లో మే నెల 18 వ తేదీ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది.

మూడు తరాల దర్శకులు... ఓ అరుదైన రికార్డు
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు చిత్ర పరిశ్రమలో రాణించడం అరుదైన విషయమే. అయితే… అంతకుమించిన అరుదైన విషయం మాత్రం ఒకే కుటుంబంలో మూడు తరాల దర్శకులు ఉండడం అనే చెప్పాలి. ముఖ్యంగా… కోవెలమూడి కుటుంబం విషయానికి వస్తే… కేవలం తెలుగులోనే కాదు పొరుగు పరిశ్రమలోనూ సినిమాలు చేస్తూ అరుదైన రికార్డు సొంతం చేసుకుంటోంది.

మహేష్ బాబుతోనూ రిపీట్ చేస్తాడా?
సి. అశ్వనీదత్… భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలచిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. వైజయంతీ మూవీస్ సంస్థ అధినేతగా పలు ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు… నిన్నటితరం అగ్ర కథానాయకులతోనూ… ఈ తరం స్టార్ హీరోలతోనూ అనేక చిత్రాలను నిర్మించారు దత్. ఇక అసలు విషయానికొస్తే… నిన్నటితరం అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్ కృష్ణకి కలిసొచ్చిన నిర్మాతగా అశ్వనీదత్ కి మంచి పేరే ఉంది. కృష్ణ కథానాయకుడిగా ‘గురు శిష్యులు’, ‘అడవి సింహాలు’, ‘అగ్నిపర్వతం’వంటి చిత్రాలను నిర్మించారు దత్. తొలి, మలి చిత్రాల మాటెలా ఉన్నా… మూడో చిత్రంగా వచ్చిన అగ్ని పర్వతం మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ…