సీనియర్ నటుడు సత్యరాజ్ తెలుగులో కూడా మంచి మంచి ఆఫర్లను సొంత చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.. ఇటీవల వచ్చిన జెర్సీ సినిమాలో పాత్ర కూడా అంతే మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎఫ్ 2 సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లో కూడా వరుణ్ ఇటీవలే పాల్గొన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో వరుణ్ నెగిటివ్ రోల్ లో నటించనున్నాడు.
ఈ సినిమాతో పాటు వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తో సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. దీనికోసం
వరుణ్ అమెరికా వెళ్లి అక్కడ ఓలింపిక్ చాంపియన్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రంలోనే సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
[subscribe]
[youtube_video videoid=aJ7vWnOwy1o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: