పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టి… ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ ఆరంభంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్… అదే జోరులో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు. అలా ప్రయత్నించిన చిత్రమే ‘జానీ’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో… పవన్, రేణు దేశాయ్ జంటగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీత, రఘువరన్, అలీ, బ్రహ్మాజీ, ఎం.ఎస్.నారాయణ, మల్లికార్జునరావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రమణ గోగుల స్వరపరచిన స్వరాలన్నీ శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా “ఏ చోట నువ్వున్నా”, “ఈ రేయి తీయనిది” పాటలకు మంచి ఆదరణ లభించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం జయాపజయాలను పక్కన పెడితే… దర్శకుడిగా పవన్‌లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2003 ఏప్రిల్ 25న రిలీజైన ‘జానీ’… నేటితో 16 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=Z2oyjNKGyNY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: