ఫైనల్లీ ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదల తరువాత ఏపీలో ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. మార్చి 22న ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ ను ఆపేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దాంతో ఏపీలో రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించగా… కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ నటించాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటించాడు. మరి ఈసినిమా ఏపీలో ఎంత దుమారం రేపుతుందో.. చూడాలి.
[subscribe]
[youtube_video videoid=DUu1gScXol4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: