కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ఇస్తున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 7న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా.. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకొని కోలుకున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈసినిమాతో మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతన్న ఈ మొదటి సినిమాను అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=zM2vhgOnFMw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: