మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఇక ఆ సక్సెతో వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ టిఎమ్ కృష్ణ దర్శకత్వంలో హిప్పి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ఈ మూవీ కూడా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలాగనే కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ & స్ప్రింట్ టెలీ ఫిల్మ్స్ బ్యానర్ పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ మరో సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమాపై కార్తికేయ తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు. యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న నా మూడో సినిమా టైటిల్ ను రేపు మధ్యాహ్నం(ఏప్రిల్ 25) 12 గంటల 6 నిమిషాలకు ప్రకటిస్తామని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
కాగా రియల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరి ఆర్ఎక్స్ 100 సినిమాలాగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందేమో చూద్దాం. దీంతో పాటుగా శేఖర్ రెడ్డి తో మరో సినిమాకు కమిటయ్యాడు కార్తికేయ. సినిమాకు టైటిల్ కూడా ఖరారవడం విశేషం. దీనికి ‘90 ఎంఎల్’ అని పేరు పెట్టినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=nnl_cL9PZ8U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: