వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కీర్తి సురేష్ దూసుకుపోతుంది. ఇక ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…అటు హీరోగా.. ఇటు విలన్ గా.. మరోవైపు కుమార బాబు లాంటి క్యారెక్టర్లు చేస్తూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, ఫాథర్ గా మంచి పాత్రలతో దూసుకుపోతున్నారు. మరి అలాంటి వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది.. క్రేజీ కాంబినేషన్ కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ప్రస్తుతం వికారాబాద్ మరియు పూణెే పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డైరెక్టర్ – నగేష్ కుకునూర్
బ్యానర్ – వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
ప్రొడ్యూసర్ – సుధీర్ చంద్ర
కో ప్రొడ్యూసర్ – శ్రావ్య వర్మ
మ్యూజిక్ – దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్ – చిరన్ తన్ దాస్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్

[subscribe]
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: