అర్జున్ సురవరం కు తప్పని కష్టాలు

Arjun Suravaram Movie Postponed Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Arjun Suravaram Movie Latest Updates,Nikhil Arjun Suravaram Movie Release Date Changed Again,Arjun Suravaram Movie Latest News,Nikhil New Movie Release Date Postponed Again,Arjun Suravaram Movie Gets Another Release Date
Arjun Suravaram Movie Postponed Again

నిఖిల్ అర్జున్ సురవరం సినిమాకు ఒకదాని తరువాత ఒకటి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మొదట్లో సినిమా టైటిల్ వివాదం… దాంతో టైటిల్ ను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రిలీజ్ డేట్ ను కూడా మార్చుకున్నారు. ఎన్నోసార్లు వాయిదా వేసుకున్న తరువాత ఎట్టకేలకు ఇటీవల మే 1 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈ రిలీజ్ కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రేపు అవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకడం లేదట. దాంతో సినిమా విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈరోజు జరగాల్సిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను కూడా రద్దు చేసుకున్నారు. ఇక ఈవిషయాన్ని నిఖిల్ ఓ లేఖ ద్వారా తెలిపాడు. ఈసినిమా విడుదల మరో సారి వాయిదాపడింది అనే విషయం బాధపెట్టినా.. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని నిఖిల్ తెలియజేశాడు.

కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు నోచుకుంటుందో చూద్దాం.

[subscribe]


[youtube_video videoid=nnl_cL9PZ8U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =